ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో చనిపోతాడని, అప్పుడు యుద్ధం ఆగిపోతుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిక్ రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు 4 లక్ష మంది చనిపోయి ఉంటారని అంచనా. రెండు దేశాల సైన్యంతోపాటు, సాధారణ పౌరులు కూడా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం విరమింపజేసేందుకు అమెరికా చేస్తోన్న ప్రయత్నాలు ఫలించలేదు. యుద్ధం ఆపేందుకు రెండు దేశాల అధినేతలు ముందుకు రాకపోవడంతో శాంతి చర్చలు ముందుకు సాగడం లేదు.