మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి గురించి సహనటుడు మోహన్‌లాల్ శబరిమల ఆలయంలో పూజ జరిపించడం మీద కొంతమంది ముస్లిములు వివాదం రాజేసారు. మమ్ముట్టి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. అల్లా తప్ప వేరే దేవుణ్ణి ఎలా నమ్ముతావంటూ నిలదీస్తున్నారు.
మమ్ముట్టికి ఇటీవల కొంత అనారోగ్యం చేసిన సంగతి తెలిసిందే. ఆయన మిత్రుడు, మరో మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తన తాజా సినిమా విడుదల సందర్భంగా మార్చి 18న శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్ళారు. అక్కడ పూజలు చేయించుకున్నారు. అదే సమయంలో తన స్నేహితుడైన మమ్ముట్టి పేరు మీద కూడా పూజలు జరిపించారు. ఆ సందర్భంగా మమ్మట్టి అసలు పేరయిన మహమ్మద్ కుట్టి అనే పేరుతో రసీదు రాసారు. ఆ రసీదు బైటపడింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మమ్ముట్టికి మోహన్‌లాల్ పూజలు చేయించడాన్ని కొందరు ముస్లిములు మమ్ముట్టిని తప్పు పడుతున్నారు. ‘మాధ్యమం’ అనే పత్రిక మాజీ సంపాదకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ అబ్దుల్లా… ఈ వ్యవహారంలో మమ్ముట్టిదే తప్పు అంటూ మండిపడుతున్నాడు. తన తరఫున శబరిమలలో పూజలు చేయించాలని మమ్ముట్టి మోహన్‌లాల్‌ను కోరి ఉంటే దానికి మమ్ముట్టి క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేసాడు. ఇస్లాంను విశ్వసించేవారు కేవలం అల్లాను మాత్రమే ప్రార్ధించాలని, అన్యులు ఎవరికీ ప్రార్ధనలు చేయకూడదనీ వాదించారు. పలువురు ముస్లింలు ఆ వాదనను సమర్ధించారు. మమ్ముట్టి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో వీరంగాలు వేస్తున్నారు.
ఆ వివాదం మీద మోహన్‌లాల్ స్పందించారు. మమ్మట్టి తనకు ఆప్తమిత్రుడని, తన కుటుంబంతో పాటు మమ్ముట్టి కోసం కూడా తానే పూజలు చేయించాననీ వివరించారు. పూజలనేవి వ్యక్తిగతమైన విషయమనీ, మమ్ముట్టి కోసం తను పూజలు చేయిస్తే అందులో తప్పేమీ లేదనీ మోహన్‌లాల్ అన్నారు. తన మిత్రుడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు తాను పూజలు చేయించడంలో దోషమేముందని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం స్వల్ప అనారోగ్యం పాలయిన మమ్ముట్టి ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారని, ఆందోళన పడాల్సిందేమీ లేదనీ మోహన్‌లాల్ వెల్లడించారు.
అనారోగ్యం నుంచి కోలుకుంటున్న మమ్ముట్టి విషయంలో కేరళ ముస్లిముల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంది. ఆయన ఏం చేసాడో ఏం చేయలేదో తెలుసుకోకుండానే తీర్పులు ఇచ్చేస్తున్నారు. మమ్ముట్టి క్షమాపణలు చెప్పాల్సిందే అని నిలదీస్తుండడం చూస్తే, పరమత సహనం పట్ల వారికి ఎంత విశ్వాసం ఉందో అర్ధమవుతోంది.