ఆసియాలో అతిపెద్ద జైలు తిహార్ జైలు తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వం సిద్దమవుతోంది. తిహార్ జైలు సమీపంలోని కాలనీ వాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జైలును ఢిల్లీ నగర శివారులకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. దీనిపై నివేదిక తయారు చేసేందుకు రూ.10 కోట్లు కేటాయించారు.
ఢిల్లీలో ఆరు దశాబ్దాల కిందట 400 ఎకరాల్లో తిహార్ జైలు నిర్మించారు. అందులో 9 ప్రధాన జైళ్లు నిర్వహిస్తున్నారు. 18 వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇటీవల కాలంలో జైల్లో ఫోన్లు మాట్లాడుకుంటున్నారని, ఖైదీలు జైలు నుంచే నేరాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు రావడంతో 15 ప్రాంతాల్లో జామర్లు బిగిస్తున్నారు.