సహకార రంగంలోని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య సంగం డెయిరీ మరో ఘనత సాధించింది. రూ.2 వేల కోట్ల టర్నోవర్ సాధించిన సహకార డెయిరీగా మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది రైతులకు రూ.50 కోట్ల బోనస్ చెల్లించనున్నట్లు డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర ప్రకటించారు. రాబోయే రోజుల్లో సంగం డెయిరీ రైతులకు రాయితీ ధరలకు విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు. ఇప్పటికే సంగం డెయిరీ టమాటో విత్తనాలు, గడ్డి విత్తనాలు ఉత్పత్తి చేస్తోందన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు మిర్చి విత్తనాలు కూడా అందిస్తామని డెయిరీ ఛైర్మన్ ప్రకటించారు.
వచ్చే ఏడాది అదనంగా లక్షన్నర లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ నరేంద్ర కుమార్ వెల్లడించారు. సంగం ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.