జమిలి ఎన్నికలపై అధ్యయనానికి వేసిన జేపీసీ గడువును పెంచడానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల కోసం 129వ రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుపై అధ్యయనం చేసేందుకు 39 మంది ఎంపీలతో జేపీసీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఇంకా అధ్యయనం చేయాల్సిన అంశాలు మిగిలే ఉండటంతో, కమిటీ గడువును వర్షాకాల సమావేశాలు చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించారు. ఇందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఇప్పటికే పలువురు న్యాయ కోవిదులు జమిలి ఎన్నికలకు చేయాల్సిన రాజ్యాంగ సవరణలపై పలు సూచనలు చేశారు. దేశంలోనే ప్రఖ్యాత న్యాయ కోవిదులు పలు సలహాల, సూచనలు చేశారు. వీటిపై కమిటీ పరిశీలన చేస్తోంది.