ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని పాలన గాడిలో పెడుతున్నామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి బడులు తెరిచే సమయానికి ఉపాధ్యాయులు బడుల్లో చేరాలా నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు.
గత ప్రభుత్వ విధ్వంస పాలన నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అన్నారు. సంక్షేమం, సుపరిపాలన అందించాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల పాటు 9 నెలల పాలనపై కలెక్టర్లలో చంద్రబాబునాయుడు సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.