అగ్ని ప్రమాదంలో ఇంట్లో కాలిపోయిన రూ.50 కోట్ల నగదు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. డబ్బు కాలిపోయిన ఘటన వెలుగు చూసిన తరవాత జస్టిస్ వర్మకు రిజిస్ట్రీ ఎలాంటి కేసులు అప్పగించలేదు. తాజాగా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది.
అయితే వర్మను విధులకు దూరం పెట్టనున్నారు. జస్టిస్ వర్మ వ్యవహారం న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో సుప్రీంకోర్టు సీజే చర్యలకు ఉపక్రమించారు. సీజే చర్యలను ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ కొనియాడారు.