నగరాల్లోని మాల్స్, మల్టీఫ్లెక్స్‌లలో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. ఎవరి ఇష్టం వచ్చిన విధంగా వారు పార్కింగ్ రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రుసుముల వసూలుపై పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి.
నూతన నిబంధనల ప్రకారం మొదటి 30 నిమిషాలు వాహన పార్కింగ్ ఉచితం. మాల్స్, మల్టీఫ్లెక్స్‌లలో ఏదైనా కొనుగోలు చేస్తే గంట వరకు ఎలాంటి రుసుము వసూలు చేయడానికి వీల్లేదు. గంటకుపైగా పార్కింగ్ చేసిన వారు సినిమా టికెట్, బిల్లులు చూపిస్తే వారికి కూడా ఉచితం. ఎంత రుసుము వసూలు చేస్తారనే దానిపై పురపాలకశాఖ స్పష్టత ఇవ్వలేదు.