ఏపీ ఇంటర్ విద్యలో సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. మొదటి ఏడాది ఇంటర్ ప్రశ్నాపత్రాల నమూనాను బోర్డు విడుదల చేసింది. గణితంలో ఒకే పేపర్, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు 85 మార్కులకు ఉంటాయి. సైన్సు గ్రూపులో ఐదు పేపర్లే ఉంటాయి. మొదటి ఏడాది విద్యార్థులకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటిసారిగా ఒక మార్కు ప్రశ్నలను పరిచయం చేస్తున్నారు. సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలను ఇంటర్ బోర్డు తయారు చేసింది. మొదటి ఏడాది జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి సిలబస్‌ను ప్రవేశపెట్టారు. పదో తరగతిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమల్లో ఉంది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో కూడా ఎన్‌సీఈఆర్టీ తీసుకురానున్నారు.