ఐపీఎల్ -2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు, నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు నష్టపోయి 209 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు చేయగా, పూరన్ 30 బంతుల్లో75 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 27 పరుగులతో రాణించాడు.
దిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా , కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం 210 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ జట్టు, మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి సాధించింది. అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ సంచలన బ్యాటింగ్‌తో డీసీకి విజయాన్ని అందించారు.
విప్రజ్ 15 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అశుతోష్ 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మణిమరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీశారు.
ఐపీఎల్-2025 పోరులో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.