ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పొందేందుకు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారుల వద్ద ఎందుకు హాజరు కాలేదని ధర్మాసనం ప్రశ్నించింది.
తన తల్లికి అనారోగ్యం పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి కొర్టును తప్పుదారి పట్టించినట్లు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనిపై పోలీసులు సమగ్ర నివేదిక తయారు చేసి, సీల్డు కవరులో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.