గుంటూరు సీఐడి కార్యాలయంలో నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన కేసులో బెయిల్ పొందిన పోసాని, ప్రతి సోమ, గురువారంనాడు సీఐడి కార్యాలయంలో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఇవాళ పోసాని గుంటూరు సీఐడి కార్యాలయంలో హాజరయ్యారు.
ఐదు కేసుల్లో పోసాని బెయిల్ పొందారు. మరో 13 కేసులు ఆయనపై నమోదయ్యాయి. బాపట్ల పోలీసులు పోసానిని విచారణ కోరనున్నారని తెలుస్తోంది.