అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే ఏటా అమెరికా విద్యార్థి విసాల జారీలో కోత పడుతోంది. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థం అవుతుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఏకంగా 41 శాతం ఎఫ్ 1 వీసాలకు కత్తెరేసింది.
అమెరికా విదేశాంగశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023- 24లో ఎఫ్- 1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఇందులో 2.79 లక్షలు తిరస్కరించారు. అంటే 41 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అంతకు ముందు సంవత్సరంలో 6.99 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. 2.53 లక్షలు తిరస్కరించారు. అంటే 36 శాతానికి సమానం.2013 14లో 7.69 లక్షల మంది ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1.73 లక్షలు తిరస్కరించారు. అంటే 23 శాతం మాత్రమే. ఎలా విద్యార్థి వీసాలకు కత్తెరపడటంతో విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.