హైదరాబాద్ పాతబస్తీలో అరాచకం జరిగింది. సంతోష్‌నగర్‌లో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటోన్న ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని దస్తగిరి దారుణంగా హత్య చేశాడు. అదే అపార్టుమంటులో నివాసం ఉంటోన్న దస్తగిరితో ఓ మహిళకు వివాదం ఏర్పడింది. ఇజ్రాయెల్ సహకారంతో దస్తగిరిపై కేసు పెట్టింది. దీంతో పగపెంచుకున్న దస్తగిరి కాపుకాచి ఇవాళ ఉదయం ఇజ్రాయెల్‌పై కత్తితో దాడికి దిగాడు.
తీవ్రంగా గాయపడ్డ ఇజ్రాయెల్‌ను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా ఇజ్రాయెల్ ప్రాణాలు కోల్పోయాడు. హత్యకు పాల్పడిన దస్తగరి ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇజ్రాయెల్ మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్టు కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.