పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు కీలక నేతలు హతమయ్యారు. ఆదివారం జరిపిన దాడుల్లో ఐదుగురు హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో హమాస్ రాజకీయ విభాగం నేత ఇస్మాయిల్ బర్హుమ్ కూడా ఉన్నారు. పాలస్తీనాలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఇస్మాయిల్‌పై ఐడీఎఫ్ దాడులు చేసింది. ఆసుపత్రి నుంచి హమాస్ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తోందని ఇజ్రాయెల్ దళాలు చెబుతున్నాయి.
ఈ దాడుల్లో సలా బర్దావిల్ కూడా ఇటీవల హతమయ్యారు. హమాస్ పొలిట్ బ్యూరోలో ఇతను కూడా కీలక నేత. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేల మంది సాధారణ పౌరులు మరణించారని గాజాలోని ఓ నేత వ్యాఖ్యానించారు. అయితే దాడులకు హమాస్ ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తోంది ఇజ్రాయెల్ ఆరోపించింది.