ఐపీఎల్2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. మ్యాచ్ 2 లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీ ఆటకు హైలెట్ . ట్రావిస్ హెడ్ (67), క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) మెరుపులు అదనపు బలంగా మారింది.
లక్ష్యఛేదనలో రాజస్తాన్ రాయల్స్ కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 242 పరుగులు చేసింది.
శాంసన్ 37 బంతుల్లో 66 పరుగులు, జురెల్ 35 బంతుల్లో 70 పరుగులు చేశారు. హెట్మెయర్ , 23 బంతుల్లో 42 పరుగులు చేయగా , శుభమ్ దూబే ( 34 నాటౌట్)గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) విఫలమయ్యారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. మహ్మద్ షమీ , ఆడమ్ జంపా చెరొక వికెట్ తీశారు.