వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విడదల రజని మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేట సమీపంలోని మహాలక్ష్మి స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి రూ.2.2 కోట్లు వసూలు చేశారనే ఫిర్యాదు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి మంత్రి రజని, ఆమె బంధువు గోపి, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా తనను బెదిరింపు రూ.2.2 కోట్లు కాజేశారని అందిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీలు పేరుతో మహాలక్ష్మి స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి సీజ్ చేస్తామని డబ్బు వసూలు చేసినట్లు ఫిర్యాదులందాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో పడింది. మాజీ మంత్రి రజని రూ.2 కోట్లు, ఆమె బంధువు గోపి రూ.10 లక్షలు, ఐపీఎస్ అధికారి జాషువాకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.