భారత సరిహద్దులు మరింత బలోపేతం కానున్నాయి. సరిహద్దులో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను కలిగి ఉన్న రోబోను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గౌహతి సహకారంతో స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబోను అభివృద్ధి చేసింది.సైనికులు మాన్యువల్‌గా చేసే నిఘాకు భిన్నంగా క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో స్వయంప్రతిపత్తి, నియంత్రణ వ్యవస్థలను ఈ రోబోలు కలిగి ఉన్నాయని కంపెనీ సీఈవో అర్నబ్ కుమార్ బర్మాన్ చెప్పారు.
సరిహద్దుల వెంట మానవ సంచారం ఉంటే వెంటనే రోబోలు సైనికులను అలర్ట్ చేస్తాయని కంపెనీ సీఈవో తెలిపారు. స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ తయారు చేసిన రోబోలకు రక్షణ శాఖ గుర్తింపు లభించిందని సీఈవో బర్మన్ వెల్లడించారు.