తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపీ దర్శనాలకు బ్రేక్ వేశారు. ఈ నెల 25, 30వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 25న కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం, 30న తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. 24, 29 తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి, 24న దర్శనానికి అనుమతిస్తారు. వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఘాట్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. కాలినడక భక్తులతో అలిపిరి మెట్టు మార్గం జన సంద్రంలా మారింది.