అమెరికాలో అరాచకం చోటు చేసుకుంది. న్యూమెక్సికోలోని లాస్ క్రూసెజ్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 15 మంది గాయపడ్డారు. అనుమతి లేని కారు విషయంలో చెలరేగిన కాల్పులు, చివరకు గ్రూపుల మధ్య యుద్ధంగా మారాయి. పోలీసులకు విషయం తెలియడంతో వెంటనే రెండు గ్రూపులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అమెరికాలో 14 కోట్ల మందికి తుపాకీ లైసెన్సులు పొందారు. ఆత్మరక్షణతోపాటు, ఆస్తుల రక్షణకు కూడా కోట్లాది మంది తుపాకులు కలిగి ఉండటంతో ఏ మాత్రం ఘర్షణ జరిగినా కాల్పులకు దారితీస్తోంది.