అమర్‌నాథ్ గుహ వరకు రోప్ వే నిర్మించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దం చేయాలని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బాల్‌టాల్ నుంచి సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహ వరకు 11.60 కి.మీ రోప్ వే నిర్మించనున్నారు. బడ్ గాం, రామ్ బన్ జిల్లాల్లొ రెండు రోప్ వేలు ఈ జాబితాలో ఉన్నాయి. శంకరాచార్య ఆలయం వద్ద కూడా రోప్ వే ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్దం చేస్తున్నారు.
ఏటా అమర్‌నాథ్ యాత్రకు 3 లక్షలకుపైగా భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. ప్రకృతి అనుకూలించని సమయాల్లో గుహ వద్దకు ఎవరినీ అనుమతించరు. దీంతో ఏడాదితో మూడు నెలలు మాత్రమే యాత్రలో భక్తులు పొల్గొనగలుగుతున్నారు.