ఐపీఎల్- 2025 సీజన్ భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 174 పరుగులు చేసింది. బెంగళూరు 16.2 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 177 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో RCB నెగ్గింది.
కోల్ కతా కెప్టెన్ అజింక్య రహానె 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు రాబట్టాడు. రఘువంశీ 22 బంతుల్లో 30 పరుగులు చేయగా మిగతావారు విఫలమయ్యారు. వెంకటేశ్ అయ్యర్ (6) రింకు సింగ్ (12), ఆండ్రీ రస్సెల్ (4) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.
బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు వికెట్లు తీయగా , హేజిల్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, యశ్ దయాల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
బెంగళూరు ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 36 బంతుల్ 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పటీదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేయడంతో లక్ష్య ఛేదన సులువుగా మారింది.
కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు.