ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీనివాసరావు ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు.
మార్చి 22 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా తదుపరి సమాచారం చేరవేస్తారు. సందేహాల నివృత్తి కోసం 70751-59996, 70750-39990 సంప్రదించాలి. ఆంధ్రప్రదేశ్ లో 352 కేజీబీవీలు ఉండగా ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా నేడు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.
కేజీబీవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు.