మూడు నెలలపాటు ఫోన్ నెంబరు వాడకుంటే యూపీఐ సేవలు నిలిపి వేయాలని ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల పాటు కాల్స్, మెసేజ్‌లు లేని ఫోన్ నెంబర్లు గుర్తించి వెంటనే యూపీఐ సేవలు నిలిపివేయాలని పేమెంట్స్ సంస్థ స్పష్టంచేసింది. కొందరు ఫోన్ నెంబర్లు మార్చినా, బ్యాంకుల్లో అకౌంటు కేవైసీలో నంబరు మార్చుకోవడం లేదు. దీని వల్ల ఓ నెంబరుతో యూపీఐ సేవలు పొంది, తరవాత నెంబరు మార్చిన వారు గత నెంబరు యాడ్ చేసిన అన్ని బ్యాంకు ఖాతాల్లో కొత్త నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చేయడం లేదు. దీని వల్ల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని గుర్తించారు.
నెంబరు మార్చుకున్న వినియోగదారులు వెంటనే బ్యాంకు ఖాతాల్లో కూడా కొత్త నెంబరు కేవైసీ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సైబర్ నేరగాళ్ల భారిన పడే ప్రమాదముందని యూఎన్సీఐ గుర్తించింది.
వినియోగంలో లేని నెంబర్లను గుర్తించి టెలికం సంస్థలు, యూపీఐ సేవలు అందిస్తున్న పేమెంట్ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఎన్‌పీసీఐ కోరింది. వినియోగంలో లేని నెంబర్లకు నోటిఫికేషన్లు పంపించి స్పందించనివారికి యూపీఐ సేవలు నిలిపివేయాలని స్పష్టం చేసింది.