భారత్‌పై కొనసాగుతున్న ఆంక్షలకు తెరపడింది. ఎట్టకేలకు అమెరికా తేజస్ ఫైటర్ ఇంజన్లు సరఫరా ప్రారంభించింది. రెండేళ్లుగా ఇంజన్లు అందకపోవడంతో తేజస్ ఫైటర్ జెట్‌ల తయారీ నిలిచిపోయింది. తాజాగా 12 ఇంజన్లు కొద్ది రోజుల్లో భారత్ చేరనున్నాయి. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రికల్ ఏరోనాటిక్స్ సంస్థ తేజస్ పైటర్ జెట్‌కు ఎఫ్ 404 ఇంజన్లు సరఫరా చేస్తోంది.
అమెరికా ఆంక్షల కారణంగా తేజస్ జెట్ ఇంజన్ల సరఫరా రెండేళ్లుగా నిలిచిపోయింది. ఏటా 20 ఇంజన్లు సరఫరా కావాల్సి ఉంది. 700 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగినా అమెరికా ఆంక్షలతో తేజస్ ఇంజన్ల సరఫరా నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవిలోకి వచ్చాక, ఆయుధాల సరఫరాకు అంగీకరించారు.
చైనా ఫైటర్ జెట్లతో పాక్ బలపడుతుంటే, భారత్ ఫైటర్ జెట్ ఇంజన్ల కోసం రెండేళ్లుగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ట్రంప్ ఆదేశాలతో తేజస్ ఇంజన్లు భారత్ చేరబోతున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ తేజస్ జెట్ ఇంజన్లతో పైటర్ విమానాలు రూపొందించనుంది.