రోడ్డు ప్రమాదం సీనియర్ పోలీస్ అధికారి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్ శివారు హయత్‌నగర్ మండలం లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీపీ బాబ్జి చనిపోయారు. తెల్లవారుజామున వాకింగ్ ముగించుకుని జాతీయ రహదారి దాటుతోన్న డీసీపీ బాబ్జీని వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాబ్జి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసి ప్రమాద కారణాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.