ఐపీఎల్ 2025 అట్హహాసంగా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధంకాగా తొలి మ్యాచ్‌కు వానగండం పొంచి ఉండటంపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మార్చి 22న జరగనుంది. కానీ వర్షం కారణంగా రద్దయ్యే ప్రమాదం పొంచివుంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వాన పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నాడు కూడా వాన పడింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వాన కురిసింది. వాన కారణంగా ప్రారంభోత్సవ వేడుకలు దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. కానీ వారి ఆశలకు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్ టీమ్‌కు కొత్త కెప్టెన్ అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున మైదానంలో అడుగుపెడుతున్నాడు.
ఆర్సీబీ విషయానికొస్తే కప్పును తన ఖాతాలో వేసుకునేందుకు తహతహలాడుతోంది. రజత్ పాటిదార్ ను ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమించింది.
ఆర్సీబీ జట్టు..
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్
కేకేఆర్ జట్టు..
అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్‌నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్