అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కొనసాగిస్తోంది. త్వరలో మరో 295 మంది అక్రమ వలసదారులను అమెరికా తరలించనుందని, లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు 398 మందిని భారత్‌కు తరలించినట్లు మంత్రి గుర్తుచేశారు. 2009 నుంచి 2024 వరకు అమెరికా నుంచి 15 వేల మంది అక్రమ వలసదారులను భారత్‌కు తరలించారని తెలిపారు.
అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికాలో విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. మొదటిసారి ఫిబ్రవరి 5న తరలించినప్పుడు మహిళలు, పిల్లలకు కూడా సంకెళ్లు వేశారని, తరవాత తరలింపులో మహిళలు, పిల్లలకు సంకెళ్లు వేయలేదనే విషయాన్ని అధికారులు స్వయంగా వెళ్లి నిర్థారించుకున్నారని మంత్రి తెలిపారు.