ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఏపీలో 17 పొలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కర్నూలు మొబైల్ కోర్టు, తాజాగా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేశాయి.
పోసాని విడుదల ఇవాళ ఉంటుందా? లేదంటే మరో కేసులో పిటి వారెంటుపై పాడేరు పోలీసులు తీసుకెళతారా అనేది తెలియాల్సి ఉంది. రెండు కేసుల్లో బెయిల్ పొందిన పోసాని, మరో 15 కేసులు ఎదుర్కొంటున్నారు. గత 36 రోజులుగా పోసాని రిమాండు ఖైదీగా ఉన్నారు.