నాలుగు మాసాల్లో విశాఖ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తామని పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో విశాఖ నగర అభివృద్ధిపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. మేలో విశాఖ మెట్రోకు టెండర్లు పిలుస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం విశాఖ నగర అభివృద్దిని గాలికి వదిలేసిందని మంత్రి నారాయణ వెల్లడించారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రస్తుతం 600 టీడీఆర్ బాండ్లు పెండింగులో ఉన్నాయని, జిల్లా కలెక్టర్ సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.