రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో మందుల దుకాణాల్లో ఈగల్ టీం, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మత్తు మందులు దుర్వినియోగం అవుతున్నాయనే నిఘా వర్గాల సమాచారంతో ఈగల్ టీం రంగంలోకి దిగింది. ఒకే సారి వంద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ భవానీపురం, గుణదల ప్రాంతాల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
అవనిగడ్డలోని ఓ మందుల దుకాణంలో పెద్ద ఎత్తున అల్ఫ్రాజోలం మత్తు మందును గుర్తించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర పాంతాల్లోనే ఈగల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈగల్ టీం చీఫ్ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.