శ్రీశైలం డోర్నాల మార్గంలో తుమ్మలబైలు సమీపంలో ఓ మలుపు వద్ద ఇసుక లారీ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీని తొలిగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మూల మలుపులో నిలిచిపోవడం, భారీగా బరువు వున్న వాహనం కావడంతో కదిలించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
లారీని తొలగించే వరకు ట్రాఫిక్ పునరుద్దరణ జరిగే అవకాశం లేదు. లారీ నుంచి ఇసుక తొలగించి ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.