హనీట్రాప్ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. హనీట్రాప్ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, అందులో ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చినా బీజేపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. దీంతో సభ 20 నిమిషాలు వాయిదా పడింది. హనీట్రాప్ వ్యవహారం వదిలేసి ముస్లింల రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు.
హనీట్రాప్ వ్యవహారంలో అధికార, విపక్ష సభ్యులు 46 మంది వరకూ ఇరుక్కుపోయారంటూ సహకార మంత్రి రాజన్న చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. కొందరు ఎమ్మెల్యేల అసభ్య వీడియోలు ఉన్నాయంటూ ఇటీవల మంత్రి రాజన్న వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ జరిపిస్తామని హోం మంత్రి పరమేశ్వర స్పష్టం చేశారు.