లండన్‌లోని అతి రద్దీగా ఉంటే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. 10 ఫైర్ ఇంజన్లు 70 మంది సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 22వ తేదీ వరకు విమానాశ్రయం కూడా మూసివేశారు.
విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్దరిస్తారనే విషయం వెల్లడికావాల్సి ఉంది. అతి రద్దీగా ఉండే విమానాశ్రయం మూసివేయడంతో వేలాది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఈ విమానాశ్రయం నుంచి 5 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. మంటలు విద్యుత్ కేంద్రం వరకే పరిమితం కావడంతో కొంత వరకు నష్టం తప్పిందని చెప్పవచ్చు.