ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. తిరుమల ఏడు కొండలు శ్రీవేంకటేశ్వరస్వామి సొంతమన్నారు. శేషాచల కొండల సమీపంలోనూ ఇతర వ్యాపారాలు అనుమతించమని చెప్పారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల లీజును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 35 ఎకరాల లీజులను ఇలాంటివి రద్దు చేసినట్లు గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును
పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలసి భక్తులకు స్వయంగా వారు అన్న ప్రసాదాన్ని చంద్రబాబునాయుడు వడ్డించారు. వారు కూడా అక్కడే భోజనం చేశారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.44 లక్షలు విరాళంగా అందజేశారు.