తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో తిరుమల ఉంటే మనకు యాదగిరిగుట్ట నరశింహస్వామి ఉన్నారంటూ గుర్తుచేశారు. తెలంగాణలో వేలాది శివాలయాలున్నాయన్నారు. తెలంగాణ సాంప్రదాయాన్ని రక్షించుకునేందుకు రాష్ట్రంలో దేవాలయాల దర్శనం చేసుకోవాలన్నారు.
తిరుమల దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇటీవల టీటీడీ అనుమతించింది. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు కావాల్సినన్ని దేవాలయాలు ఉన్నాయి. ఏపీకి పరుగులు తీయాల్సిన పనిలేదనే అర్థంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.