బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే ఆమోదం తెలిపారు. బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తరవాత చేర్పులు చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చడంతో వారిని న్యాయం జరిగినట్టైంది.