స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్సులు వరుసగా నాలుగో రోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. తాజాగా మదుపరుల సంపద 3 లక్షల కోట్లు పెరిగి మార్కెట్ క్యాప్ 408 లక్షల కోట్లకు చేరింది.
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించకపోయినా, స్థిరంగా కొనసాగించడంతోపాటు, ఈ ఏడాది రెండుసార్లు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తామని ప్రకటించడంతో పెట్టుబడిదారులకు ఊపు లభించింది. దీంతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి.సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 76348 వద్ద ముగిసింది. నిఫ్టీ 283 పాయింట్లు పెరిగి 22190 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐసిఐసిఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలను ఆర్జించాయి.
ముడిచమురు ధర స్థిరంగా కొనసాగుతోంది. బ్యారెల్ క్రూడాయిల్ 71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర రికార్డు స్థాయికి ఎగబాకింది. తాజాగా ఔన్సు ఫ్యూర్ గోల్డ్ 3046 అమెరికా డాలర్లకు చేరింది. దీంతో దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.92000 దాటిపోయింది. వెండి ధరలు కూడా కిలో లక్షా 3 వేలు దాటిపోయాయి.