వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ చేపట్టిన ‘ఎర్త్ అవర్’ ప్రపంచవ్యాప్త ఉద్యమంలో భాగంగా, మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేసి ‘ఎర్త్ అవర్’ పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.
WWF సంస్థ చేపట్టిన ‘ఎర్త్ అవర్’ ప్రచారం ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రపంచమంతా ఒక గంట సమయం అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేయడం వల్ల విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుంది. ఆ మేరకు విద్యుదుత్పత్తిని తగ్గించడం సాధ్యమవుతుంది. ఆ విద్యుత్‌కు అవసరమైన ప్రకృతి వనరుల వాడకం తగ్గించినట్లవుతుంది. కాబట్టి ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడం… వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తుందని, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సాయపడుతుందనీ అబ్దుల్ నజీర్ ఆశాభావం వ్యక్తం చేసారు.