తమిళనాడు ఎంపీల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభకు నినాదాలు, అసభ్య పదాలు రాసిన టీ షర్టులు ధరించి రాకూడదనే నిబంధనలు తెలియవా? అంటూ డీఎంకే ఎంపీలను ప్రశ్నించారు. ఇవాళ లోక్‌సభ సమావేశాలకు డీఎంకే ఎంపీలు.. పునర్విభజన న్యాయబద్దంగా చేయాలి.. తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది..అంటూ నినాదాలు రాసిన టీ షర్టులతో హాజరుకావడం స్పీకర్ ఆగ్రహానికి దారితీసింది.
2026లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు అధికార డీఎంకే సభ్యులు వాదిస్తున్నారు. జనాభా నియంత్రణ విధానాలు కట్టుదిట్టంగా అమలు చేసినందుకు తాము ఎంపీ సీట్లను కోల్పోవాల్సి ఉంటుందంటూ సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజనలో తమకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తా మంటూ హెచ్చరించారు.
తిరుమల దర్శనానికి ప్రతిసారి వారిని అడుక్కోవాలా : సీఎం రేవంత్రెడ్డి