బెట్టింగ్ యాప్‌ల కేసులో 25 మందికి హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆరుమంది సోషల్ మీడియా ప్రభావితులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా మరో 19 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నటి మంచు లక్ష్మి ఉన్నారు. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇప్పటి వరకు యూట్యూబర్ విష్ణుప్రియ మాత్రమే పోలీసుల వద్ద హాజరయ్యారు. మిగిలిన ఐదు మంది నుంచి ఎలాంటి సమాచారం లేదు. యూట్యూబర్స్ బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా మరికొందరికి నోటీసులు అందజేశారు. అయితే వారు ఇప్పటి వరకు పోలీసుల విచారణకు హాజరుకాలేదు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించండి అంటూ ప్రకటనల్లో నటించిన వారికి హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి పదుల సంఖ్యలో యువత అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు సిద్దమయ్యారు.
తిరుమల దర్శనానికి ప్రతిసారి వారిని అడుక్కోవాలా : సీఎం రేవంత్రెడ్డి