మహారాష్ట్రలోని నాగపూర్‌లో మార్చి 17 సాయంత్రం అరాచకం విలయతాండవం చేసింది. హిందూ సంస్థల నిరసన ప్రదర్శనలో కురాన్ ప్రతిని తగులబెట్టారనే పుకార్లతో ముస్లిం మూకలు భారీస్థాయిలో హింసాకాండకు పాల్పడ్డాయి. దుండగులు దారుణమైన దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ముస్లిం మూకలు రాళ్ళు రువ్వడం, వాహనాలను తగలబెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. ఆ ఘర్షణల్లో 33మంది పోలీసులు, 30మందికి పైగా సాధారణ పౌరులూ గాయపడ్డారు. ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఆ ఘర్షణలకు కారణమైన పుకార్లకు మూలాలను వెతుకుతున్నారు. జనాలను రెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి, హింసాకాండకు పురిగొల్పడంలో కీలక పాత్ర పోషించిన 100కు పైగా సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పడుతున్నారు.
ఈ హింసాకాండ, హిందూ సంస్థల ఆందోళన ప్రదర్శన మీద ఆగ్రహ ప్రదర్శన. ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న మొగల్ దుర్మార్గుడు ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్‌తో హిందూ సంస్థలు ఆందోళన చేపట్టాయి. ఆ ప్రదర్శనలో భాగంగా నిరసనకారులు ఆ నిరంకుశ నవాబు దిష్టిబొమ్మను దహనం చేసారు. ఆ వెంటనే, ఆ దిష్టిబొమ్మతో పాటు కురాన్ ప్రతిని కూడా తగులబెట్టారంటూ తప్పుడు వార్తలను దురుద్దేశపూర్వకంగా వ్యాపింపజేసారు. ఆ నిరాధారమైన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో దావానలంలో చెలరేగిపోయాయి. దాంతో ముస్లిం మూకలు నాగపూర్ వీధుల్లో వీరంగం మొదలుపెట్టారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ నాగపూర్‌లో ప్రజ్వరిల్లిన హింసను ఖండించారు. ‘‘నాగపూర్‌లో విహెచ్‌పి, బజరంగ్‌దళ్ నిరసనలు చేపట్టాయి. దాన్ని అడ్డం పెట్టుకుని మతపరమైన కొన్ని పదార్ధాలను తగలబెట్టినట్టు పుకార్లు వ్యాపింపజేసారు. అదంతా ముందే బాగా ప్రణాళిక వేసుకుని చేసిన దాడిలా ఉంది. శాంతిభద్రతలను తమ చేతిలోకి తీసుకునే అనుమతి ఎవరికీ లేదు. దుండగుల దాడుల్లో ముగ్గురు డీసీపీలు సహా 33మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. పోలీసుల మీద దాడులను సహించే ప్రసక్తే లేదు. కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఫడ్నవీస్ శాసనసభలో చెప్పారు.
ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా అదే తరహాలో మాట్లాడారు. నాగపూర్ హింస ‘ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన కుట్ర’ అని వ్యాఖ్యానించారు. ఔరంగజేబును మహానుభావుడంటూ కీర్తించే వారిని షిండే దుయ్యబట్టారు. ‘‘నిజమైన దేశభక్త ముస్లిములు సైతం ఔరంగజేబును సమర్ధించరు’’ అన్నారు. మొగలు పీడకులపై సానుభూతి చూపేముందు మరాఠా-మొగలుల ఘర్షణ గురించి అసలైన చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు.
మహారాష్ట్ర పోలీస్ సైబర్ సెల్ ఇప్పుడు వందకు పైగా సోషల్ మీడియా ఖాతాలపై దర్యాప్తు మొదలుపెట్టింది. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఆ అకౌంట్స్ ద్వారా ఎక్కడో జరిగినవీ, మార్చివేసినవీ అయిన వీడియోలను ప్రచారంలోకి తెచ్చారని అధికారులు ధ్రువీకరించారు. ఆ తప్పుడు కథనాలను పట్టించుకోవద్దనీ, మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ప్రజలకు సూచించారు.
చాలామంది ప్రముఖ ముస్లిం ప్రచారవేత్తలు, అతివాద శక్తులూ తప్పుడు సమాచారాన్నీ, అబద్ధాలనూ శరవేగంగా ఆన్‌లైన్‌లో ప్రచారంలో పెట్టారు, తద్వారా తమ హింసాకాండను సమర్ధించుకున్నారు. వారిలో ప్రధానమైన వాడు ఆసిఫ్ ముజ్తబా. ఐఐటీ ఢిల్లీలో చదువుకున్నవాడు, జర్నలిస్టుగా చెప్పుకుంటున్నవాడు అయిన ఆసిఫ్ తప్పుడు ఆరోపణలు చేసాడు. హిందుత్వ శక్తులు కురాన్ ప్రతిని కలిగిఉన్న చాదర్‌ను తగులబెట్టేసారంటూ తప్పుడు ప్రచారం చాలా వేగంగా వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు. జిహాదిస్టు సానుభూతిపరుడైన బాలీవుడ్ రచయిత దరాబ్ ఫారూఖీ కూడా హిందువులే హింసాకాండకు కారణమంటూ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రచారంలో పెట్టాడు.
పుకార్లను వ్యాపింపజేయడమే అలవాటైన హరూన్ ఖాన్, వాటిని భూతద్దంలో చూపించి వైరల్ చేసాడు. మొదట కురాన్‌ను తగులబెట్టారన్న తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో హరూన్ ఖాన్ ప్రచారం చేస్తే, అమీన్ సయీద్ అనేవాడు ఆ పుకారును ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచమంతా పాకించాడు. అర్షద్ ఖురేషీ పుకార్లను మరింత వండివార్చాడు. హిందువులు కురాన్ ప్రతిని కాళ్ళతో తొక్కారనీ, ఆ తర్వాతే తగులబెట్టారనీ కొత్తరంగు వేసి మరీ అబద్ధాలను వ్యాపింపజేసాడు. ఆ అబద్ధాలనే అడ్డం పెట్టుకుని పాకిస్తానీ సోషల్ మీడియా అకౌంట్లు మరింత రెచ్చిపోయారు. తమదేశంలోని హిందూ మైనారిటీల దారుణమైన స్థితిని వాటంగా మరచిపోయి, ‘‘భారతీయ ముస్లిముల ఊచకోత’’ అంటూ పాక్‌లోని సోషల్ మీడియాలో అవాకులూ చెవాకులూ పేలారు. ఈ పరిణామాలన్నీ చూస్తే మనకు అర్ధమయ్యేది ఒకటే విషయం… నిజమైన అల్లరి మూకలను కవచంలా కాపాడి, నాగపూర్ నగరంలో మతోద్రిక్తతలను రెచ్చగొట్టడం ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అల్లరి మూకలు ముఖాలు కప్పుకుని, ఆయుధాలు ధరించి, కత్తులు ఝుళిపిస్తూ, పెట్రోలు బాంబులు ఇతర ఆయుధాలతో హిందువులపై దాడులు చేసారు. ఆ అల్లర్లలో బాగా దెబ్బతిన్న ప్రాంతాలు చిట్నీస్ పార్క్, మహల్. అక్కణ్ణుంచి విషయం క్షణాల్లో నగరమంతా టముకు వేసారు. దుండగులు రాబోయే శ్రీరామ నవమికి నిర్వహించే శోభాయాత్రల కోసం సిద్ధం చేస్తున్న అలంకరణలను లక్ష్యం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో హిందువుల పండుగలను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు.
ఆ దాడుల్లో భాగంగా 3 కార్లు, 30 వాహనాలను తగులబెట్టేసారు. ఒక ప్రత్యక్ష సాక్షి ముస్లిం దుండగుల ఘాతుకాన్ని ఇలా వివరించాడు, ‘‘వాహనాలను తగలబెట్టవద్దంటూ మేము అరిచాము. మంటలను ఆర్పడానికి నేను ఒక గొట్టంతో నీరు చిమ్మడానికి ప్రయత్నించాను. వాళ్ళు నా మీదకు రాళ్ళు రువ్వారు. నా రెండు వాహనాలతో పాటు పార్కింగ్‌లో ఉన్న చాలా వాహనాలకు నిప్పుపెట్టారు.’’
మరో బాధితుడు ఇలా చెప్పాడు. ‘‘మహల్ ప్రాంతంలో ఐదారు వందల మంది గుంపు వస్తుండడం చూసాను. వాళ్ళు అల్లాహో అక్బర్, లబైక్ యా రసూల్ అల్లా అంటూ నినాదాలు చేస్తున్నారు. వాళ్ళు విసురుతున్న రాళ్ళలో కొన్ని నా కారుకూ తగిలాయి. నాకు దెబ్బలు తగలకుండా తప్పించుకోగలిగాను.’’
హిందువుల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు చేసారని బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దాట్కే మండిపడ్డారు. దుండగులు ఏ దుకాణాలను తగులబెట్టాలో ఎంపిక చేసుకున్నారని, కేవలం హిందువుల దుకాణాలకే నిప్పు పెట్టారని, వాటితో పాటే ఉన్న ముస్లిముల దుకాణాలను కనీసం ముట్టుకోలేదనీ చెప్పారు. ‘ఒకచోట నాలుగు దుకాణాలున్నాయి. వాటిలో రెండు హిందువులవి, రెండు ముస్లిములవి. కేవలం హిందువుల దుకాణాలకు మాత్రమే నిప్పు పెట్టారు’ అని వివరించారు.
దుండగులు అంతటితో ఆగలేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించి, తమ దాడులకు సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా, దాడికి పాల్పడే ముందే ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసేసారు. ఆ విషయాన్ని చంద్రకాంత్ కావడే అనే హిందూ వ్యాపారి స్పష్టం చేసారు. ‘‘వాళ్ళు మొదట కెమెరాలు పగలగొట్టారు. తర్వాతే ఈ ప్రాంతం అంతా నిప్పుపెట్టారు. హింసాకాండ ముగిసిన అరగంట వరకూ హింసాకాండ కొనసాగుతూనే ఉంది’’ అని చెప్పారు. హిందూ వ్యాపారులు, దుకాణదారులు ఎదుర్కొన్న నష్టాలకు వ్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు.
అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. పరిస్థితి దిగజారిపోవడంతో అధికారులు కర్ఫ్యూ విధించక తప్పలేదు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 ప్రకారం కొత్వాలీ, గణేశ్‌పేట, లాకడ్‌గంజ్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.