బంగారం ధరలు మరోసారి కొండెక్కాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.91950 దాటిపోయింది. ఒకే రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగింది. మూడు రోజుల కిందట 10 గ్రాముల పసిడి ధర రూ.90 వేలు దాటగా తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి బయట పడుతున్నారు. దీంతొ బంగారంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో తాజాగా గోల్డ్ ధర ఔన్సు 2976 డాలర్లకు చేరింది. వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి లక్షా 3 వేలు దాటిపోయింది. ఆర్నమెంట్ బంగారం ధర కూడా 10 గ్రాములు 87వేలు దాటిపోయింది. ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు లేవని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.
#todaygoldprice #todaygoldrate