పురుష ఉద్యోగులపై కట్టుకున్న భార్యల వేధింపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. భార్య వేధింపులు భరించలేక ఇటీవల ఓ టెకీ వీడియో పోస్ట్ చేసి మరీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా పురుష సమాజంలో కలకలం రేపింది. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ బెంగళూరులో వర్క్ ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భార్య వేధింపులు తాళలేక బెంగళూరులోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్లో భార్యపై ఫిర్యాదు చేశారు. కార్యాలయం పని ప్రారంభించగానే తన భార్య పిచ్చి డాన్సులు వేస్తోందని, కాపురం చేయాలంటే రోజుకు రూ.5 వేలు ఇవ్వాలంటూ వేధిస్తోందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను వేధిస్తున్నాడంటూ కేసు పెడతానంటూ భార్య బెదిరింపులకు దిగుతోందని వాపోయాడు. విడాకులు ఇవ్వమని కోరినా రూ.45 లక్షల డిమాండ్ చేస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడని పోలీసులు తెలిపారు.
అయితే శ్రీకాంత్ తనను వదిలించుకుని మరో వివాహం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకున్నట్లు చెబుతోంది. అందుకే సంబంధం లేని వీడియోలను ఎడిట్ చేసి, తనపై పోలీసులకు ఫిర్యాదు చాశాడని చెబుతోంది. అయితే ఈ కేసులో ఎవరు చెప్పింది నిజం అని తేల్చే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.