Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం: అసెంబ్లీలో సత్యకుమార్ యాదవ్

Phaneendra by Phaneendra
Mar 19, 2025, 01:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం శాసనసభలో సభ్యులు ఆహారకల్తీ గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 

ఆహార పదార్ధాల అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతులు వంటి అంశాల నియంత్రణ, పర్యవేక్షణ విషయంలో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆ చట్టం రాష్ట్రంలో ఆహార భద్రతా అధికారుల ఆధ్వర్యంలో అమలవుతోందని వివరించారు. ఆహార భద్రత కమీషనర్, అడ్జుడికేటింగ్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్ట్, జిల్లా అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహక విభాగాలూ ఆ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయని వివరించారు. ఆహార భద్రత అధికారులు తమ అధికార పరిధిలో వున్న తయారీదారులు, హోల్ సేలర్లు, రిటైలర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని చెప్పారు.  ఆహార నమూనాలను సేకరించి సమీప ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నారని, 2006 నుంచీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనల ప్రకారం సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు.

2019-2024 మధ్య కాలంలో మొత్తం 45,509 ఆహార నమూనాలను సేకరించి విశ్లేషించారు. అందులో 2,473 నమూనాలు నిబంధనలను ఉల్లంఘించినట్లున్నాయి. 654 నమూనాలు సురక్షితం కావని తేలింది. 1,779 నమూనాలు తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాయని మంత్రి వివరించారు. సురక్షితం కాని ఆహార నమూనాలకు సంబంధించి విచారణకు, పెనాల్టీతో జైలు శిక్ష విధించేందుకు సంబంధిత జిల్లాల మేజిస్ట్రీట్ కోర్టు సమక్షంలో కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.

ఆహార భద్రతా చట్టం నిబంధనల ప్రకారం నేర తీవ్రతను బట్టి జరిమానాలు, జైలు శిక్షలూ ఉంటాయని మంత్రి వివరించారు. చిన్న నేరాలకు లక్ష నుండి 10 లక్షల రూపాయల వరకూ జరిమానాలు పడతాయని చెప్పారు. పెద్ద నేరాలకు కనీసం ఆరు నెలల నుండి ఆరేళ్ళ వరకూ జైలు శిక్ష పడుతుందని వివరించారు. ఆహారం తినటం వల్ల వ్యక్తి మరణిస్తే కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుందని, దాన్ని జీవిత ఖైదు వరకూ పొడిగించవచ్చన్నారు. దానితో పాటు రూ.10 లక్షలకు పైబడిన జరిమానా కూడా విధించవచ్చన్నారు. 

ఇప్పటి వరకూ దాదాపు 1,365 చిన్న నేరాల కేసులను, 110 పెద్ద నేరాల కేసులను జాయింట్ కలెక్టర్, అడ్జుడికేటింగ్ అధికారి నిర్ణయించారని, రెండు సందర్భాలలో మొత్తం రు.1.69 కోట్ల మేర జరిమానా విధించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.

Tags: AP AssemblyFood AdulterationFood SafetyHealth MinisterSatya Kumar YadavTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.