భారత మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. భారత్ లో పర్యటించి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. సుమారు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్, నేడు స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణమైంది.
ఆస్ట్రోనాట్ సునీతాతో పాటు విల్మోర్.. మరో ఇద్దరు కూడా డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమిపై అడుగుపెట్టనున్నారు. గత ఏడాది జూన్ నుంచి స్పేస్ స్టేషన్‌లోనే సునీతా విలియమ్స్ ఉన్నారు.
సునీతా విలియమ్స్‌కు మార్చి ఒకటో తేదీనమోదీ లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆమె బాగోగుల గురించి అమెరికా పర్యటనలో అధికారులను అడిగి మోదీ తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు.
వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ సునీత విలియమ్స్ ఆరోగ్యం కోసం భారతీయులు ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని లేఖలో మోదీ పేర్కొన్నారు. ఈ లేఖ 140 కోట్ల భారతీయుల మనోగతాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. ఆస్ట్రోనాట్ మైక్ మాసిమినో ద్వారా ఆ లేఖను పంపారు.