జమ్ము కాశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం బయట పడింది. ఓ మహిళ తుపాకీతో భద్రతా ఏర్పాట్లను దాటుకుని దేవాలయంలోకి ప్రవేశించింది. దేవాలయంలో మహిళ వద్ద తుపాకీ గుర్తించిన సిబ్బంది, ఆమెను పోలీసులకు అప్పగించారు. ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో ఆమె పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. లైసెన్స్ ముగిసిన తుపాకీ ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో వైష్ణోదేవి ఆలయం ఒకటి. మూడంచెల భద్రతా వ్యవస్థ అక్కడ అమల్లో ఉంది. భక్తుల రక్షణతోపాటు, ఉగ్రవాదుల ముప్పు కూడా పొంచి వున్న దేవాలయం కావడంతో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. మెటల్ డిటెక్టర్లు, స్కానర్లతో భక్తులను పరిశీలిస్తారు. ఇన్ని చర్యలు తీసుకున్నా ఆ మహిళ తుపాకీతో దేవాలయంలోకి ఎలా ప్రవేశించింది? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.