మహారాష్ట్రలో హింస చెలరేగింది. శంభాజీ నగర్ ఖుల్దాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ మహల్ ప్రాంతంలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఓ మతానికి చెందిన గ్రంథాన్ని తగులు బెట్టారనే వార్తలు వ్యాపించాయి. దీంతో నాగ్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అదుపు చేసేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
నాగ్‌పుర్ పరిధిలోని గణేశ్‌పేట, పచ్చావులి, కొత్వాలి, సక్కర్‌దర, శాంతినగర్, ఇమామవాడ, యశోధరనగర్,నందన్‌వన్, కపిల్‌నగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని నాగ్‌పుర్ పోలీస్ కమిషనర్ రవీందర్‌కుమార్ సింగల్ హెచ్చరించారు.
నాగ్‌పుర్‌లోని హంసపురిలో ఆందోళనకారలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. నివాసాలు, షాపులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. 15 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఘర్షణకు దిగిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు కమినర్ తెలిపారు.