ఇంగ్లీష్ నేర్చుకుంటేనే తెలివితేటలు రావని, మాతృభాషలో చదువుకున్న వారే బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చెప్పారు. హిందీ జాతీయ భాష, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అని గుర్తు చేశారు. భాషలను రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదని సూచించారు. వివిధ దేశాల భాషలు నేర్చుకున్న వారికి ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
హిందీపై దుష్ప్రచారం తగదన్నారు. హిందీ నేర్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు వెళ్లినప్పుడు ఉపయోగపడుతుందన్నారు. అలాగే మాతృభాషను కాపాడుకోవాలన్నారు. తల్లి భాషను మించిన భాష లేదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉందని గుర్తుచేశారు.