ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీయే అమరావతి రాజధాని నిర్మాణం కోసం పిలిచిన 37 వేల కోట్ల విలువైన టెండర్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీకి ప్రత్యేక చట్టం తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నంబూరు సమీపంలోని వివిఐటి కాలేజీకి ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పించారు.
చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో లక్షా 32 వేల కోట్ల ప్రైవేటు కంపెనీల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అనంతపురం జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.